పులివెందులలో కాల్పుల కలకలం

పులివెందులలో కాల్పుల కలకలం
  • కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి
  • కాల్పుల్లో గాయపడిన దిలీప్, మహబూబ్ బాషా
  • దిలీప్ పరిస్థితి విషమం
  • ఆర్థిక వివాదాలే కారణమని వెల్లడి
కడప జిల్లా పులివెందులలో ఓ ఘర్షణ సందర్భంగా తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయి. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో దిలీప్, మహబూబ్ బాషా అనే వ్యక్తులు గాయపడ్డారు. వీరిని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో దిలీప్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దిలీప్ ను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

భరత్ కుమార్, దిలీప్ మధ్య ఆర్థిక వివాదాలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో, ఇంటికి వెళ్లి తుపాకీ తీసుకువచ్చిన భరత కుమార్ యాదవ్ కాల్పులు జరిపాడు. కాగా, కాల్పుల్లో గాయపడిన మహబూబ్ బాషా మీడియాతో మాట్లాడుతూ, భరత్ కుమార్ యాదవ్ ఐదు రౌండ్లు కాల్చాడని వెల్లడించాడు. 

కాగా, భరత్ కుమార్ యాదవ్ ను గతంలో వివేకా హత్యకేసులో సీబీఐ ప్రశ్నించినట్టు తెలుస్తోంది.


More Telugu News