వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

  • వచ్చే ఎన్నికల్లో సీపీఐ బరిలో ఉంటుందన్న నారాయణ
  • పొత్తు కుదిరితే తమకు సీట్లు కూడా కావాలని స్పష్టీకరణ
  • సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం జగన్ కు లేదని విమర్శలు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ బరిలో దిగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. పొత్తు కుదిరితే ఓట్లు ఇవ్వడమే కాదు, సీట్లు కూడా ఇవ్వాలని అన్నారు.

అటు, సీఎం జగన్ పైనా నారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రం మేలు కోరి ఏవైనా సలహాలు ఇస్తే, తీసుకునే తత్వం జగన్ కు లేదని అన్నారు. పోలవరంపై పోరాడడానికి రాష్ట్ర ప్రభుత్వానికి భయంగా ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. విభజన హామీలు తాము సాధించుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ శూరుడు, వీరుడు అనుకుంటే, కేంద్రం వద్ద మోకరిల్లుతున్నాడని నారాయణ విమర్శించారు. 

పోలవరంపై వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న పోరాటతత్వం జగన్ లో కనిపించడంలేదని తెలిపారు. చూస్తుంటే తండ్రి సిద్ధాంతాలకు కూడా జగన్ పంగనామాలు పెట్టేట్టు ఉన్నాడని వ్యాఖ్యానించారు.


More Telugu News