బాలీవుడ్ కు అందుకే దూరమయ్యా..: ప్రియాంక చోప్రా
- బాలీవుడ్ లో తనను ఓ మూలకు తోసేశారని ఆరోపణ
- అక్కడి రాజకీయాలకు విసిగిపోయానన్న ప్రియాంక
- అందుకే బ్రేక్ కోరుకుని, అమెరికాలో వాలిపోయినట్టు వెల్లడి
బాలీవుడ్ కు బదులు హాలీవుడ్ లో అవకాశాలు ఎందుకు వెతుక్కోవాల్సి వచ్చిందో నటి ప్రియాంకా చోప్రా వెల్లడించింది. బాలీవుడ్ అగ్ర తారల్లో ప్రియాంక చోప్రా కూడా ఒకరు. కానీ, తనకు బాలీవుడ్ పరిశ్రమలో వచ్చిన అవకాశాల పట్ల సంతోషంగా లేనని ఆమె చెప్పింది.
ఓ పోడ్ కాస్ట్ కోసం డాక్స్ షెఫర్డ్ తో ప్రియాంక ఈ విషయాలను పంచుకుంది. అమెరికాలో అవకాశాల కోసం వెతుక్కోవడం వెనుక అసలు కారణాల గురించి తాను మొదటిసారి చెబుతున్నట్టు, దీనికి కారణం తాను అభద్రతాభావానికి గురికావడం వల్లేనని పేర్కొంది. ‘దేశీ హిట్స్’ కు చెందిన అంజులా ఆచార్య తనను ఓ మ్యూజిక్ వీడియో కోసం గుర్తించినట్టు తెలిపింది. సాత్ ఖూన్ మాఫ్ సినిమా చిత్రీకరణలో ఉన్న సమయంలో తనకు ఆచార్య కాల్ చేసినట్టు వెల్లడించింది. అమెరికాలో మ్యూజిక్ కెరీర్ పట్ల ఆసక్తిగా ఉన్నారా? అని అడిగినట్టు వివరించింది.
అదే సమయంలో బాలీవుడ్ వెలుపల అవకాశాల కోసం తాను చూస్తున్నట్టు ప్రియాంకా పేర్కొంది. ‘‘నన్ను బాలీవుడ్ లో ఓ మూలకు తోసేశారు. కొందరితో విభేదాలు ఏర్పడ్డాయి. ఆ క్రీడ ఆడేందుకు నాకంత నైపుణ్యం లేదు. అక్కడి రాజకీయాలతో నేను విసిగిపోయాను. దాంతో బ్రేక్ కోరుకున్నాను. ఇప్పుడు ఈ మ్యూజిక్ నాకు ప్రపంచంలో మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం కల్పించింది. దాంతో అమెరికాకు వచ్చాను’’ అని ప్రియాంక వివరించింది.
మ్యూజిక్ కెరీర్ అనుకున్న విధంగా సాగనప్పుడు, నటనలో ప్రయత్నించి చూడాలని ఒకరు సూచించినట్టు ప్రియాంక తెలిపింది. దీంతో తాను క్వాంటికోలో నటించినట్టు చెప్పింది. ఆ తర్వాత బేబీవాచ్, మ్యాట్రిక్స్, రెవల్యూషన్స్, ద వైట్ టైగర్ లో అవకాశాలను సొంతం చేసుకోగా, త్వరలో సిటాడెల్ సెకండ్ షోతోనూ ముందుకు రానుంది. ప్రియాంక నటించిన లవ్ ఎగైన్ అనే సినిమా మేలో విడుదల కానుంది.