ఎన్టీఆర్ సినిమా కోసం రంగంలోకి దిగిన హాలీవుడ్ టెక్నీషియన్!
- సెట్స్ పైకి వెళ్లిన ఎన్టీఆర్ 30వ సినిమా
- షూటింగు పనుల్లో బిజీగా ఉన్న కొరటాల
- బ్రాడ్ మిన్నిచ్ చేతికి వీ ఎఫ్ ఎక్స్ బాధ్యతలు
- కథానాయికగా జాన్వీ కపూర్ పరిచయం
ఎన్టీఆర్ అభిమానుల నిరీక్షణకు తెరదింపేస్తూ ఆయన 30వ సినిమా షూటింగు మొదలైంది. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకి పరిచయమవుతుండటం విశేషం. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
కొరటాల ఈ సినిమా కోసం అనిరుధ్ ను తీసుకోవడం విశేషం. ఈ సినిమా కథా నేపథ్యం ఏమిటనేది అర్ధమయ్యి .. కానట్టుగా మొన్న కొరటాల రెండు ముక్కల్లో చెప్పారు. మొత్తానికి ఈ కథా పరిధి చాలా పెద్దదనీ .. భారీ బడ్జెట్ తో కూడినదనే విషయం మాత్రం అర్థమైంది. కథా పరంగా వీ ఎఫ్ ఎక్స్ కి ఉన్న ప్రాధాన్యత కూడా ఎక్కువేనని అనిపించింది.
అందుకు తగినట్టుగానే వీఎఫ్ ఎక్స్ కోసం కొరటాల హాలీవుడ్ టెక్నీషియన్ 'బ్రాడ్ మిన్నిచ్' ను రంగంలోకి దింపారు. పలు హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన అనుభవం ఆయన సొంతం. వీఎఫ్ ఎక్స్ గురించి కొరటాల .. ఆయన మాట్లాడుకుంటున్న ఫొటోను వదిలారు. ఈ సినిమా హైలైట్స్ లో వీఎఫ్ ఎక్స్ కూడా ఒకటిగా నిలవడం ఖాయమనే విషయం మాత్రం అర్థమవుతోంది.