నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. హాజరుకానున్న రెండు రాష్ట్రాల నేతలు
- హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో సమావేశం
- హాజరుకానున్న 32 మంది పొలిట్ బ్యూరో సభ్యులు
- రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల నుంచి 32 మంది సభ్యులు హాజరుకానున్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీడీపీ జోష్ లో ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని పార్టీ వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగనుంది.
తెలంగాణకు సంబంధించి అకాల వర్షాలు, రైతుల కష్టాలు, నెరవేరని రాష్ట్ర ప్రభుత్వ హామీలు, ఇంటింటికీ తెలుగుదేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ బలోపేతం, సాధికార సారథులు తదితర అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు రేపు టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభను నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు అండమాన్ నుంచి కూడా పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు. మొత్తం 15 వేల మంది హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు తెలియజేశాయి.