అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

  • మోదీ అనే ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యలు
  • రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
  • ఎంపీగా అనర్హత వేటు వేసిన పార్లమెంటు
  • తాజాగా లోక్ సభ హౌసింగ్ కమిటీ నోటీసులు
  • ఏప్రిల్ 22 లోపు బంగ్లా ఖాళీ చేయాలని స్పష్టీకరణ
సూరత్ కోర్టు జైలుశిక్ష విధించిన నేపథ్యంలో పార్లమెంటులో అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తాజాగా కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని రాహుల్ గాంధీ ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఏప్రిల్ 22 లోగా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ కమిటీ స్పష్టం చేసింది. 

మోదీ అనే ఇంటి పేరు దొంగలకే ఎందుకుంటోంది అంటూ రాహుల్ గాంధీ కొంతకాలం కిందట పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ పై పరువు నష్టం దావా వేయగా, సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దాంతో, నిబంధనల ప్రకారం రాహుల్ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది.


More Telugu News