ఈ హీరోలతో యాక్ట్ చేసే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా: ఫరియా అబ్దుల్లా

  • 'రావణాసుర'గా కనిపించనున్న రవితేజ
  • ఆయన సరసన నాయికగా ఫరియా అబ్దుల్లా 
  • రవితేజ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అని వ్యాఖ్య 
  • తన ఫేవరేట్ హీరోలు వీరేనని వెల్లడి
  • ఏప్రిల్ 7వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఫరియా అబ్దుల్లా హైదరాబాద్ అమ్మాయి. 'జాతిరత్నాలు' సినిమా ద్వారా పరిచయమైంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రావణాసుర' రెడీ అవుతోంది. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమాలోని ఐదుగురు కథానాయికలలో ఫరియా ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "రవితేజగారి కాంబినేషన్లో నా సీన్స్ చాలా ఉన్నాయి. ఆయన కామెడీ టైమింగును .. ఎనర్జీని అందుకోవటం చాలా కష్టం. బాగా ప్రిపేర్ అయిన తరువాతనే నేను కెమెరా ముందుకు వెళ్లేదానిని. షూటింగు గ్యాపులో మాత్రం అయన చాలా సరదాగా ఉంటారు" అని అంది. 

'రావణాసుర' తరువాత నేను బిజీ అవుతానని అనుకుంటున్నాను. ప్రభాస్ .. మహేశ్ బాబు ... ఎన్టీఆర్ .. చరణ్ .. బన్నీ.. విజయ్ దేవరకొండలతో  కలిసి నటించాలని ఉంది. అలాంటి ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.



More Telugu News