పట్టువదలని టెకీ.. 150 సంస్థలు తిరస్కరించినా ఎట్టకేలకు జాబ్
- 8 నెలల తరువాత ఉద్యోగం సాధించిన టెకీ
- తన అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్
- ప్రస్తుత పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని వెల్లడి
- నిరాశ చెందకుండా కృషి చేయాలని ఫ్రెషర్లకు సూచన
ప్రస్తుతం టెక్ రంగంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి లేఆఫ్స్ కారణంగా జాబ్స్ కోల్పోయిన టెకీలు కొత్త ఉద్యోగం సంపాదించేందుకు నానాయాతనా పడుతున్నారు. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ టెకీ పట్టుదలతో విజయం సాధించాడు. అనుకున్న విధంగా కొత్త జాబ్ కొట్టాడు. తాను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందో వివరిస్తూ అతడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఫ్రెషర్లకు అతడిచ్చిన సలహా నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.
లింక్డ్‌ఇన్‌లో అతడు తన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు. ‘‘లేఆఫ్స్ కారణంగా టెక్ రంగంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. నా అప్లికేషన్‌ను అనేక కంపెనీలు తిరస్కరించాయి. 2022 జులైలో ఉద్యోగ వేట ప్రారంభించా. జాబ్ దొరికేందుకు ఏకంగా ఎనిమిది నెలలు వేచి చూడాల్సి వచ్చింది. అనుభవజ్ఞుడినైనా కూడా ఇంత కాలం వెయిట్ చేయాల్సి రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఫ్రెషర్‌గా ఉన్నప్పుడే తొందరగా జాబ్ దొరికింది. ఇప్పటివరకూ 150కి పైగా కంపెనీలకు దరఖాస్తు చేశా. కానీ..వాటిలో 10 కంపెనీలే స్పందించగా.. అందులోనూ కేవలం ఆరు కంపెనీల నుంచే ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది’’ అంటూ తను పడ్డ కష్టాన్ని కళ్లకుకట్టినట్టు వివరించాడు. అమెజాన్(ఫిన్‌ల్యాండ్), గూగుల్ ఇండియాలో జాబ్స్ త్రుటిలో తప్పిపోయాయని చెప్పుకొచ్చాడు. అయినా పట్టువిడవకుండా ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగించడంతో చివరకు జాబ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు.
‘‘మీరు కూడా జాబ్ కోసం వెతుకుతున్నట్టయితే..మరీ ముఖ్యంగా మీరు ఫ్రెషర్ అయితే అనవసరంగా ఒత్తిడికి లోనుకాకండి. నిరుత్సాహ పడకండి. ప్రస్తుత పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని చెప్పేందుకే నా అనుభవాన్ని నెట్టింట్లో పంచుకుంటున్నా. పరిస్థితులు ఒకప్పటిలా లేవు. ఇప్పుడు జాబ్ దొరకాలంటే చాలా కష్టపడాలి. మన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటూ కొత్త పరిచయాలు పెంచుకునేందుకు యత్నించాలి. మీ పని మీరు చేయండి. శక్తివంచన లేకుండా శ్రమించండి. మిగతాది ఆ భగవంతుడిపై వదిలేయండి’’ అంటూ అతడు రాసుకొచ్చాడు. గత నెలలోనే కొత్త సంస్థలో చేరినట్టు వివరించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.