'దాస్ కా ధమ్కీ' మండే టాక్ ఎలా ఉందంటే ..!

  • ఈ నెల 22న విడుదలైన 'దాస్ కా ధమ్కీ'
  • ద్విపాత్రాభినయం చేసిన విష్వక్ 
  • భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా
  • మండే రోజుకీ మారని టాక్  
విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'దాస్ కా ధమ్కీ' ఉగాది కానుకగా ఈ నెల 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాకి విష్వక్ దర్శక నిర్మాతగా వ్యవహరించడమే కాదు, స్క్రీన్ ప్లే - మాటలు ఆయనే రాసుకున్నాడు. నివేద పేతురాజ్ ఆయన జోడీ కట్టింది. సినిమా నిర్మాణం కోసం మాత్రమే కాదు, పబ్లిసిటీ కోసం కూడా విష్వక్ ఒక రేంజ్ లోనే ఖర్చు చేశాడు. వరుస ప్రమోషన్స్ తో ఎక్కడ చూసినా తనే కనిపించాడు. 

ఆ స్థాయిలో విష్వక్ చేసిన ప్రయత్నం ఫలించింది. భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ సినిమాలో విష్వక్ ద్విపాత్రాభినయం చేశాడు. ఫస్టాఫ్ లో కథ అంతా కూడా రొటీన్ గా నడుస్తుంది. సెకండాఫ్ లో ట్విస్టులు ఎక్కువైపోయి కథ ఎటెటో వెళ్లిపోతుంటుంది. హీరో ద్విపాత్రాభినయమే ఈ సినిమాలో ప్రధానమైన అంశం. ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని డిజైన్ చేయడంలో విష్వక్ విఫలమయ్యాడనే టాక్ వచ్చింది. 

ఇక ఫస్టు డే తో పోల్చుకుంటే రెండో రోజునే వసూళ్లు తగ్గాయి .. మూడో  రోజున నిలకడగానే ఉన్నాయని అంటున్నారు. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. కథపై ఇంకాస్త కసరత్తు .. స్క్రీన్ ప్లే పై మరింత దృష్టి పెట్టి ఉంటే, రెండు పాత్రల బాడీ లాంగ్వేజ్ ను డిఫరెంట్ గా డిజైన్ చేసి ఉంటే, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదనే టాక్ వినిపిస్తోంది. 



More Telugu News