నెల్లూరు నర్తకి సెంటర్ లో ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల కాపలా

  • ఎమ్మెల్యే అనిల్ పుట్టినరోజు పురస్కరించుకుని ఫ్లెక్సీ ఏర్పాటు
  • ఎన్టీఆర్ విగ్రహానికి ఫ్లెక్సీ అడ్డుగా ఉందని నగర టీడీపీ ఇంచార్జ్ అభ్యంతరం
  • ఫ్లెక్సీని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులకు అభ్యర్ధన
  • ఫ్లెక్సీని ఎవరైనా తొలగించవచ్చనే అనుమానంతో పోలీసుల పహారా
వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కటౌట్‌కు ఏకంగా 15 మంది పోలీసులు కాపాల కాశారు. వీరులో ఓ సీఐ కూడా ఉండటం విశేషం. రెండు రోజుల క్రితం అనిల్ కుమార్ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని నర్తకి సెంటరులో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే.. ఎన్టీఆర్ విగ్రహానికి అనిల్ కటౌట్ అడ్డుగా ఉందని, దాన్ని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను టీడీపీ నగర ఇన్‌చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోరారు. ఇదిలా ఉంటే..  టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం నర్తకి సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఎవరైనా అనిల్ ఫ్లెక్సీ తొలగిస్తారనే అనుమానంతో పోలీసులు పహారా కాశారు. దీంతో.. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.


More Telugu News