కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఈడీ విచారణ
- ఇప్పటికే కవితను మూడుసార్లు ప్రశ్నించిన ఈడీ
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
- కేవియెట్ దాఖలు చేసిన ఈడీ
- నేడు ఇరువర్గాల వాదనలు విననున్న సుప్రీం ధర్మాసనం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే కవిత పిటిషన్ పై ఈడీ కేవియెట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో, ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత సౌత్ గ్రూప్ లో ఉందని ఈడీ పేర్కొంటుండడం తెలిసిందే. కవితను ఈడీ ఇప్పటికే మూడుసార్లు ప్రశ్నించింది.
ఇవాళ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ తో పాటు పలు కీలక కేసుల విచారణ చేపట్టనున్నారు. వివేకా హత్య కేసు, కృష్ణా నదీ నీటి వివాదం, ఒడిశా-ఏపీ పోలవరం కేసులను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.
ఇవాళ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ తో పాటు పలు కీలక కేసుల విచారణ చేపట్టనున్నారు. వివేకా హత్య కేసు, కృష్ణా నదీ నీటి వివాదం, ఒడిశా-ఏపీ పోలవరం కేసులను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.