డబ్ల్యూపీఎల్ ఫైనల్: ముంబయి ఇండియన్స్ టార్గెట్ 132 రన్స్
- డబ్ల్యూపీఎల్ ఫైనల్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 రన్స్
- లక్ష్యఛేదనలో 4 ఓవర్లలో 2 వికెట్లకు 24 రన్స్ చేసిన ముంబయి
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ పోరులో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేసింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఢిల్లీ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు.
ముంబయి బౌలర్లలో ఇస్సీ వాంగ్ 3, హేలీ మాథ్యూస్ 3, మీలీ కెర్ 2 వికెట్లు తీశారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ మెగ్ లానింగ్ చేసిన 35 పరుగులే అత్యధికం. ఆఖర్లో రాధా యాదవ్ 12 బంతుల్లో 27, శిఖా పాండే 17 పరుగుల్లో 27 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
ఇక లక్ష్యఛేదనలో ముంబయి 4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు చేజార్చుకుని 24 పరుగులు చేసింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ 13, యస్తికా భాటియా 4 పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో నాట్ షివర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్ 1, జెస్ జొనాస్సెన్ 1 వికెట్ తీశారు.