మలబద్ధకాన్ని వదిలించుకునే సహజ మార్గాలు

  • ఆహారంలో తగినంత పీచు లేకపోవడం వల్లే మలబద్ధకం
  • తగినంత నీరు తాగకపోయినా, జంక్ ఫుడ్ తోనూ నష్టమే
  • త్రిఫల, సోంపు, మారేడు పండుతో ప్రయోజనాలు
నేడు చాలా మందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. ఆహారంలో పీచు లేని పదార్థాల పట్ల నేటి తరం వారికి ఆసక్తి ఉండడం లేదు. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. పీచు ఉన్నప్పుడే పేగుల్లో కార్యకలాపాలు సజావుగా, సాఫీగా జరుగుతాయి. అసలు మలబద్ధకానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. జంక్ ఫుడ్, ఆల్కహాల్, ఫైబర్ లేని ఆహారం, తగినంత నీరు తాగకపోవడం, మాంసం అధిక సేవనం ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. 

అయితే, ఆయుర్వేదంలో మలబద్ధకాన్ని తొలగించుకునేందుకు మంచి మార్గాలున్నాయి. వీటిని రోజువారీ తీసుకోవడం వల్ల సమస్యలు తొలగిపోయి హాయిగా ఉంటారు. ఆయుర్వేదం ప్రకారం మనసు, శరీరాన్ని వాతం నియంత్రిస్తుంటుంది. వాతాన్ని బ్యాలన్స్ చేసే  ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. శీతల ఆహారాలు, డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. వేడిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.

త్రిఫల
మలబద్ధకం సమస్యని తొలగించే మంచి ఔషధం ఇది. వేడినీళ్లలో త్రిఫల వేసి టీ చేసుకుని తాగొచ్చు. పావు చెంచా త్రిఫల, అర చెంచా ధనియాలు, పావు చెంచా కార్డమామ్ ను వేసి కూడా తీసుకోవచ్చు. వీటిని గ్లాస్ వాటర్ తో కలిపి మిక్సర్ లో వేసి తాగాల్సి ఉంటుంది.

సోంపు
టీ స్పూన్ వేయించి చేసుకున్న సొంపు పౌడర్ ను గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగాలి. సోంపు గింజలను నమిలి తిన్నా గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. 

బేల్ ఫ్రూట్ (మారేడు)
ఈ పండుకు లాక్సేటివ్ గుణాలు ఉన్నాయి. అర స్పూన్ బేర్ ఫ్రూట్ పల్ప్ ని, టీ స్పూన్ బెల్లంతో కలిపి సాయంత్రం ఆహారానికి ముందు తినాలి. మధుమేహం ఉన్న వారు మినహా మిగిలిన వారు దీన్ని తీసుకోవచ్చు

లికోరైస్ రూట్
లికోరైస్ లేదా ములేతి లో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఉన్నాయి. జీర్ణాశయ ప్రక్రియలకు సాయపడుతుంది. లికోరీ రైస్ వేరుతో చేసిన పౌడర్ ను టీ స్పూన్, దీనికి టీ స్పూన్ బెల్లం పౌడర్ ను కలుపుకుని గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగాలి. మధుమేహం ఉన్నవారు దీన్ని తాగకపోవడమే మంచిది. 



More Telugu News