ఏ కమెడియన్ ఎంట్రీ ఇచ్చినా నా పనైపోయిందనే ప్రచారం జరిగేది: బ్రహ్మానందం
- ఇటీవల థియేటర్లకు వచ్చిన 'రంగమార్తాండ'
- బ్రహ్మానందం నటనకి దక్కుతున్న ప్రశంసలు
- క్రేజ్ కాపాడుకోవడానికి ఇబ్బందిపడ్డానన్న బ్రహ్మానందం
- తన ఎదుగుదల చూసి అసూయపడినవారు ఉన్నారని వ్యాఖ్య
తెలుగు తెరపై నవ్వుల రాజుగా దశాబ్దాలుగా బ్రహ్మానందం తన జోరును కొనసాగిస్తున్నారు. ఇటీవల థియేటర్లకు వచ్చిన 'రంగమార్తాండ' సినిమాకి ఆయన నటన హైలైట్ గా నిలిచింది. అందరూ కూడా ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బ్రహ్మానందాన్ని కృష్ణవంశీ ఇంటర్వ్యూ చేశారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ .. "నా జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా భగవంతుడి అనుగ్రహమే అనిపిస్తుంది. భగవంతుడు ఛాన్స్ ఇస్తాడు .. ఛాయిస్ లు ఇవ్వడు. అలా ఆయన నాకు ఇచ్చిన ఛాన్స్ ను నేను సద్వినియోగం చేసుకున్నాను. ఆర్టిస్టుగా పేరు వచ్చేవరకూ డబ్బుకోసం ఇబ్బంది పడ్డాను .. పేరు వచ్చిన తరువాత దానిని కాపాడుకోవడానికి ఇబ్బంది పడ్డాను" అని అన్నారు.
"ఎవరైనా సరే ఎదుటివారు బాగుండాలని కోరుకుంటారు .. కానీ తమ కంటే బాగుండాలని మాత్రం కోరుకోరు. అలా నా ఎదుగుదలను చూసి అసూయపడినవారు ఉన్నారు. సుధాకర్ వచ్చాడు బ్రహ్మానందం పనైపోయింది .. బాబు మోహన్ వచ్చాడు .. ఎల్బీ శ్రీరామ్ వచ్చాడు .. పృథ్వీ వచ్చాడు .. బ్రహ్మానందం పనైపోయింది అని ప్రచారం చేశారు. అవన్నీ దాటుకుని ఇంతవరకూ వచ్చాను. 'రంగమార్తాండ' సినిమాలోని ఆ పాత్రను 'మీరు తప్ప ఇంకా ఎవరు చేయగలరు మాస్టారూ' అని మీరు నాతో అన్నారు .. అది చాలు నాకు" అంటూ చెప్పుకొచ్చారు.