మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది..: ఆనంద్ మహీంద్రా

  • బాక్సింగ్ లో స్వర్ణాలు గెలుచుకున్న నీతూ గంగాస్, స్వీటీ బూర
  • ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ కు రీట్వీట్
  • ప్రధాని మోదీ సైతం అభినందనలు
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ 2023 లో భారత్ తరఫున బంగారు పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణులు నీతూ గంగాస్, స్వీటీ బూరకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అభినందనలు తెలియజేశారు. 48 కిలోల విభాగంలో నీతూ గంగాస్ తొలి స్వర్ణం గెలిచింది. స్వీటీ 81కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది. 

ప్రపంచ వేదికపై భారత్ కు గర్వకారణంగా నిలిచారని అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ వద్ద భారత బాలిక మెరిసిందంటూ ఢిల్లీ పోలీసు విభాగం ట్విట్టర్ పోస్ట్ ను ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. స్వీటీ, నీతూ ఇద్దరి ఫొటోలను అభినందిస్తూ మరొకరు చేసిన ట్వీట్ ను సైతం రీట్వీట్ చేశారు.

‘‘బంగారు పతకాన్ని గెలుచుకున్న స్వీటీ, నీతూకి అభినందనలు. భారత్ మిమ్మల్ని చూసి గర్విస్తోంది’’అంటూ వేరొకరు చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేశారు. ఈ ఇద్దరు యువ ఛాంపియన్లకు ప్రధాని మోదీ సైతం అభినందనలు తెలియజేశారు.


More Telugu News