డిస్ క్వాలిఫైడ్ ఎంపీ.. ట్విట్టర్ ఖాతాలో బయో మార్చిన రాహుల్ గాంధీ!
- పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ కోర్టు
- తర్వాతి రోజే ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేసిన లోక్‌సభ సెక్రటేరియట్
- ‘మెంబర్ ఆఫ్ పార్లమెంట్’ను తీసేసి ‘డిస్‌క్వాలిఫైడ్ ఎంపీ’ అని మార్చిన రాహుల్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చడం, దీంతో 24 గంటల వ్యవధిలోనే లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్ ‘బయో’లో మార్పులు చేశారు. మొన్నటి దాకా ‘మెంబర్ ఆఫ్ పార్లమెంట్’ అని ఉండగా.. ఇప్పుడు ‘డిస్‌క్వాలిఫైడ్ ఎంపీ’గా మార్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెడింగ్ అవుతోంది.
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ మాట్లాడుతూ.. ‘దొంగలంతా మోదీ ఇంటి పేరునే కామన్ గా ఎందుకు పెట్టుకుంటారు?’ అని అన్నారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ అంటూ పలు పేర్లను ఉదహరించారు. దీనిపై సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. రాహుల్‌పై పరువు నష్టం కేసు వేశారు.
విచారణ పూర్తి చేసిన సూరత్ కోర్టు గత గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తర్వాతి రోజే రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని సచివాలయం రద్దుచేసింది. కేరళలోని వయనాడ్ పార్లమెంటు సీటు ఖాళీ అయినట్లు వెబ్ సైట్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో రాహుల్ బయోను మార్చడం గమనార్హం.