అమెరికాలో టోర్నడో బీభత్సం... 23 మంది మృతి

  • మిసిసిపి రాష్ట్రంపై టోర్నడో పంజా
  • రాత్రివేళ ప్రకృతి ఆగ్రహం
  • కుప్పకూలిన భవనాలు, నేలకొరిగిన చెట్లు
  • అంధకారంలో లక్షలాది మంది
తరచుగా ప్రకృతి ఆగ్రహానికి గురయ్యే అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. అమెరికాలో టోర్నడోలు ఎక్కువగా సంభవిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా మిసిసిపి రాష్ట్రంలో ఏర్పడిన భారీ టోర్నడో విలయతాండవం చేసింది. దీని ప్రభావంతో 23 మంది మృతి చెందారు. 

రాత్రివేళ సంభవించిన ఈ టోర్నడో మిసిసిపి ప్రజల పాలిట పీడకలగా పరిణమించింది. ఈ టోర్నడో ప్రభావంతో అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. మిసిసిపి రాష్ట్రంలోని అనేక పట్టణాలు నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. 

ఎక్కడ చూసినా శిథిలాల గుట్టలు, విరిగిపడిన చెట్లు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ధ్వంసమైన కార్లు, వాహనాలు దర్శనమిస్తున్నాయి. పలు పట్టణాల్లో లక్షలాది మంది అంధకారంలో మునిగిపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఫుట్ బాల్ అంత సైజులో వడగళ్లు కూడా పడినట్టు గుర్తించారు. 

కాగా, టోర్నడో విలయంతో కుప్పకూలిన భవనాల శిథిలాల కింద పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.


More Telugu News