బీజేపీ చేసిన పని రాహుల్ కి మేలు చేస్తుంది: శశిథరూర్
- గంటల వ్యవధిలోనే రాహుల్ పై వేటు వేశారన్న శశిథరూర్
- అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉన్నా వేచి చూడలేదని విమర్శ
- ఈ నిర్ణయం విపక్షాలన్నీ ఏకం కావడానికి కారణమయిందని వ్యాఖ్య
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పై వేటు వేసే విషయంలో లోక్ సభ సెక్రటేరియట్ గంటల వ్యవధిలోనే నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. ఈ అంశంలో అప్పీల్ కు వెళ్లే అవకాశం రాహుల్ కు ఉన్నప్పటికీ, వేచి చూడకుండా ఆగమేఘాల మీద అనర్హత వేటు వేశారని అన్నారు.
ఏమైనా, ఈ ఒక్క నిర్ణయం విపక్షాలన్నీ ఏకం కావడానికి కారణమయిందని చెప్పారు. దీని వల్ల ఎదురయ్యే పర్యవసానాలను బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. రాహుల్ గాంధీకి ఇది మేలు చేస్తుందని తెలిపారు. రాహుల్ కి ఏం జరిగిందనేదే ఇప్పుడు అన్ని చోట్ల హెడ్ లైన్స్ గా మారిందని చెప్పారు. ప్రపంచ దేశాలు కూడా ఈ అంశాన్ని చర్చించుకుంటున్నాయని అన్నారు. అంటీముట్టనట్టు ఉండే విపక్షాలు ఈ విషయంలో ఒక్కటయ్యాయని... రాహుల్ పై అనర్హత వేటు వేయడాన్ని ముక్త కంఠంతో ఖండించాయని చెప్పారు.