50 మంది ఎమ్మెల్యేలను తొలగిస్తారని ప్రచారంలో ఉంది: మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్
- వైసీపీ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సస్పెన్షన్
- తనను తప్పుబట్టడంపై మేకపాటి ఆవేదన
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓ వార్తా చానల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలను తీసేస్తారని ప్రచారం జరుగుతోందని అన్నారు. వై నాట్ 175 అని జగన్ ఏ ధైర్యంతో అనగలుగుతున్నారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. అధినాయకత్వం వద్దకు తమ వంటి సీనియర్లు వెళితే పలకరించే దిక్కు కూడా లేదని వాపోయారు.
"నా నియోజకవర్గంలో నేనండీ ఎమ్మెల్యేని. అలా కాకుండా, ఎవరో తాడుబొంగరం లేని వాళ్లను తీసుకువచ్చి, ఆయన చెప్పినట్టు వినండి అంటూ అధికారులకు సూచిస్తున్నారు. ఎమ్మెల్యేలకు సీఎం సరైన గౌరవం ఇవ్వడంలేదు. సీఎం సరే... ఆయన పక్కనున్న వాళ్లు కూడా ఎమ్మెల్యేకి నమస్కారం పెట్టరు. సీఎం పక్కన పెద్ద సంఖ్యలో సలహాదారులు ఉంటారు... వాళ్లు చేసే పనేంటి? ఎమ్మెల్యేలకు విలువ, గౌరవం ఇవ్వని పార్టీలు మూతపడక తప్పదు.
నాడు అధికారాన్ని తృణప్రాయంగా వదిలేసి రాజీనామాలు చేసి జగన్ వెంట నడిచి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కుటుంబం మాది. మీరు నన్ను తప్పుబడతారా? శేఖరన్నా... గెలిచినా, ఓడినా టికెట్ నీదే అని ఒక్క మాట అంటే ఎంత సంతోషపడతాను? కానీ నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు... ఎమ్మెల్సీ వద్దని జగన్ తో చెప్పాను" అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.