నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

  • దెందులూరు వస్తున్న సీఎం జగన్
  • మూడో విడత వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల
  • రూ.6,419 కోట్లు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
  • 78 లక్షల మందికి లబ్ది
ఏపీ సీఎం జగన్ నేడు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక్కడ జరిగే ఓ కార్యక్రమంలో మూడో విడత వైఎస్సార్ ఆసరా నిధులు విడుదల చేయనున్నారు. ఆసరా పథకం కోసం సీఎం జగన్ నేడు రూ.6,419 కోట్లు విడుదల చేస్తారు. మొత్తం 78.94 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఆసరా నిధులను నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు విడతల వారీగా మహిళా సంఘాల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. 

కాగా, ఈ ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరతారు. 10.30 గంటలకు దెందులూరు చేరుకుని, ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

సీఎం రాక నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద హెలిప్యాడ్ రూపొందించారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన సభాస్థలికి చేరుకుంటారు. దెందులూరు సమీపంలోని నేషనల్ హైవే పక్కన బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేశారు.


More Telugu News