ఆంధ్రప్రదేశ్ ను గంజాయిప్రదేశ్ గా మార్చారు: నారా లోకేశ్

  • తిరుమల కొండపై గంజాయి కలకలం
  • పట్టుబడిన కాంట్రాక్ట్ ఉద్యోగి
  • ఏపీ పరువు పోతోందన్న లోకేశ్
హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల కొండపై ఓ వ్యక్తి గంజాయితో పట్టుబడడం పట్ల టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ను గంజాయిప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. బడిలోనూ గంజాయి, గుడిలోనూ గంజాయితో ఏపీ పరువుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గంజాయిని కలిగి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారని లోకేశ్ వివరించారు. దొరకని గజదొంగలు తిరుమల కొండపై ఇంకెంతమంది ఉన్నారో అని వ్యాఖ్యానించారు. ఇందుకేనా జగన్ ఒక్క చాన్స్ అని అడిగింది? అని ఎద్దేవా చేశారు. 

గంగాధరం అనే వ్యక్తి లక్ష్మీ శ్రీనివాసం కార్పొరేషన్ తరఫున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడి నుంచి టీటీడీ విజిలెన్స్ అధికారులు 125 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని తిరుమల ఎస్ఈబీ పోలీసులకు అప్పగించారు.


More Telugu News