గుంటూరులో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం
- క్రాస్ ఓటింగ్ జరిగినట్టు నిర్ధారించుకున్న వైసీపీ
- నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ నిర్ణయం
- సజ్జల ప్రకటన వెంటనే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయంపై దాడి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ అధినాయకత్వం సస్పెండ్ చేసిన నలుగురిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఒకరు. కాగా, వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి సస్పెన్షన్ ప్రకటన చేసిన వెంటనే గుంటూరులో ఉండవల్లి శ్రీదేవి కార్యాలయంపై దాడి జరిగింది. అక్కడి ఫ్లెక్సీలు, బ్యానర్లు ధ్వంసం చేశారు. పార్టీ పట్ల ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. దాంతో శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వారిని అడ్డుకున్నారు.