సస్పెన్షన్ నిర్ణయంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమన్నారంటే...!

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్
  • నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు వేసిన పార్టీ నాయకత్వం 
  • పార్టీ నిర్ణయం సరికాదన్న శ్రీధర్ రెడ్డి
  • షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ అధినాయకత్వం సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. 

తనపై చర్యలు తీసుకున్న విధానం సరికాదని కోటంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం అని పేర్కొన్నారు. పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మొదట షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకోలేదన్న విషయం స్పష్టమైందని, పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తోందని కోటంరెడ్డి విమర్శించారు. ఏదేమైనా, పార్టీ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు.


More Telugu News