ఆర్ఆర్ఆర్ కు ఏడాది.. కొల్లగొట్టిన అవార్డులివే!
- తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆర్ఆర్ఆర్
- ‘నాటు నాటు’ అంటూ స్టెప్పులేసిన విదేశీ ప్రేక్షకులు
- గ్లోబల్ స్టార్లుగా మారిపోయిన ఎన్టీఆర్, రామ్ చరణ్
- ఏడాదిలో 17 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న సినిమా
ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం).. ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ల కల్పిత కథ ఆధారంగా ఎస్ఎస్ రాజమౌళి చేతుల్లో రూపుదిద్దుకున్న అద్భుత చిత్రం.
ఏడాది కిందట సరిగ్గా ఇదే రోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ విడుదలైంది. ప్రతి చోట కలెక్షన్ల సునామీ సృష్టించింది. రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓటీటీలో రిలీజ్ అయ్యాక.. ప్రపంచవ్యాప్తంగా మరింత మందిని ఆకట్టుకుంది. ‘నాటు నాటు’ అంటూ స్టెప్పులేసేలా చేసింది. తెలుగు ఇండస్ట్రీ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లను గ్లోబల్ స్టార్లను చేసింది.
ఈ ఏడాది ప్రయాణంలో ఆర్ఆర్ఆర్ ఎన్నో మైలురాళ్లను దాటింది. ఎన్నో హృదయాలను గెలుచుకుంది. మరెన్నో అభినందనలను అందుకుంది.. ఇంకెన్నో అవార్డులను స్వీకరించింది.. తెలుగు సినిమా కలలో కూడా ఊహించని.. అవార్డుల్లో ఎవరెస్టులా భావించే ‘ఆస్కార్’ ను సగర్వంగా ముద్దాడింది.
ఏడాది కాలంలో ఆర్ఆర్ఆర్ అందుకున్న గ్లోబల్ అవార్డులివీ..
1. తెలుగు సినిమాకు తొలిసారి ఆస్కార్ అవార్డు వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాటకు ఈ అత్యున్నత పురస్కారం వచ్చింది. అవార్డును ఆస్కార్ వేదికపై ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అందుకున్నారు.
2. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు-2023ను నాటు నాటు పాట గెలుచుకుంది.
3. లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు-2022ను నాటునాటు పాట సాధించింది.
4. ఇక 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డుల్లో డబుల్ ధమాకా సాధించింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సాంగ్ (నాటునాటు) కేటగిరీల్లో రెండు అవార్డులు అందుకుంది.
5. హాలివుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ క్రియేటివ్స్ ఆర్ట్స్ అవార్డుల్లో.. నాలుగు అవార్డులు సాధించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీల్లో తొలి స్థానంలో నిలిచింది.
6. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022 వేడుకల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళి అందుకున్నారు.
7. శాటర్న్ అవార్డ్స్-2022లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు అందుకుంది.
8. హాలివుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ 2022లో స్పాట్ లైట్ విన్నర్ అవార్డును అందుకుంది.
9.88వ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళి అందుకున్నారు.
10. ఆస్టిన్ ఫిల్మి క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లిస్ట్ చేసిన 2022 టాప్ 10 సినిమాల్లో 5 స్థానంలో ఆర్ఆర్ఆర్ నిలిచింది. బెస్ట్ స్టంట్ కోఆర్డినేటర్ అవార్డును నిక్ పావెల్ అందుకున్నారు.
11.బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ 2022లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు అవార్డు వచ్చింది.
12.జార్జియా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ 2022లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుంది.
13. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డ్స్ 2022లో ‘టాప్ 10 ఫిల్మ్స్ ఆఫ్ ది ఇయర్’లో చోటు దక్కించుకుని అవార్డు అందుకుంది.
14.అలయన్స్ ఆఫ్ ఉమెన్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అవార్డ్స్ 2022లో బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ అవార్డు అందుకుంది.
15. ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్‌ట్రాక్ అవార్డులు సాధించింది.
16. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022 - ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది.
17. సౌత్ ఈస్టర్న్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో అవార్డు పొందింది.