వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 398 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 131 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ను లాభాలలో ప్రారంభించిన మార్కెట్లు కాసేపటి తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. అయితే చివరి అరగంటలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 398 పాయింట్లు కోల్పోయి 57,527కి పడిపోయింది. నిఫ్టీ 131 పాయింట్లు పతనమై 16,945 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ బ్యాంక్ (0.74%), ఇన్ఫోసిస్ (0.43%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.18%), టెక్ మహీంద్రా (0.16%), ఏసియన్ పెయింట్స్ (0.05%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-3.81%), బజాజ్ ఫైనాన్స్ (-3.19%), టాటా స్టీల్ (-2.58%), రిలయన్స్ (-1.96%), ఎల్ అండ్ టీ (-1.95%).


More Telugu News