క్రాస్ ఓటింగ్ ఆరోపణల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి కీలక వ్యాఖ్యలు
- వైసీపీ అభ్యర్థి వెంకటరమణకే ఓటు వేశానన్న మేకపాటి
- జగన్ తన పట్ల సానుకూలంగా లేరని వ్యాఖ్య
- సొంత పార్టీ నేతలే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశానంటూ తనపై దుష్ప్రచారం జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పార్టీ చెప్పినట్టుగానే తాను వైసీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణకే ఓటు వేశానని చెప్పారు. తన ఓటుతోనే వెంకటరమణ గెలిచారని అన్నారు. ఓటు వేసిన తర్వాత తాను ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వచ్చానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలేసి, జగన్ కుటుంబం కోసం వచ్చినవాడినని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, ఇవ్వకపోతే లేదని అన్నారు. తనకు టికెట్ ఇచ్చే విషయంలో జగన్ కూడా సానుకూలంగా లేరని చెప్పారు.
తన నియోజకవర్గం ఉదయగిరిలో తానంటే ఏమిటో చూపిస్తానని మేకపాటి అన్నారు. తనకు వ్యతిరేకంగా తమ పార్టీ నేతలే చేస్తున్నారని మేకపాటి మండిపడ్డారు. ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఫ్లెక్సీలను తాను తొలగిస్తున్నాననే తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జగన్ ఫ్లెక్సీలను అధికారులు తొలగించారని.. ఆ వీడియోలను వాడుకుంటూ కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.