బాలకృష్ణ సినిమా డైలాగులు రాజకీయాల్లో పని చేయవు: వల్లభనేని వంశీ

  • కొనుగోలు చేయడంలో చంద్రబాబు నిష్ణాతుడన్న వల్లభనేని
  • తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిపోయారని వ్యాఖ్య
  • ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ వైసీపీదే విజయమన్న వంశీ
నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తమ మాజీ బాస్ చంద్రబాబు డబ్బులు ఆశగా చూపి కొనుగోలు చేయడంలో నిష్ణాతుడు అని విమర్శించారు. ప్రలోభ పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. గతంలో తెలంగాణలో స్టీఫెన్సన్ ను కొనుగోలు చేస్తూ ఓటుకు నోటులో చంద్రబాబు దొరికిన సంగతి అందరికీ తెలుసని చెప్పారు. 

రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ రాని నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు బేరం కుదుర్చుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో గెలుస్తామని మొన్నటి ఎన్నికల్లో టీడీపీ చెప్పిందని... ఇప్పుడు ఏపీలో 175 సీట్లు గెలుస్తామని చెపుతోందని.. ఏవైనా జరిగే విషయాలు చెపితే బాగుంటుందని అన్నారు. బాలకృష్ణ సినిమా డైలాగులు రాజకీయాల్లో పని చేయవని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ వైసీపీదే గెలుపని అన్నారు.


More Telugu News