బన్నీలా ముందుకొచ్చే హీరోలు ఎంతమంది ఉన్నారు?: గుణశేఖర్
- గుణశేఖర్ తీర్చిదిద్దిన 'శాకుంతలం'
- ఏప్రిల్ 14వ తేదీన సినిమా విడుదల
- దుష్యంతుడి పాత్ర పట్ల ఇక్కడి హీరోలు ఆసక్తిని చూపలేదని వ్యాఖ్య
- అందుకు కారణం అదేనంటూ వివరణ
టాలీవుడ్ లో చారిత్రక .. పౌరాణిక సినిమాలను కూడా అద్భుతంగా తెరకెక్కించగలిగిన దర్శకుడిగా గుణశేఖర్ కి మంచి పేరు ఉంది. సమంత ప్రధానమైన పాత్రధారిగా ఆయన రూపొందించిన 'శాకుంతలం' ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుణశేఖర్ ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు.
తాజా ఇంటర్వ్యూలో .. దుష్యంతుడి పాత్రకు తెలుగు హీరోను తీసుకోకపోవడానికి కారణం ఏమిటనే ప్రశ్న గుణశేఖర్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. 'శాకుంతలం' అనే టైటిల్ పెట్టి దుష్యంతుడి పాత్రకి ఏ హీరోను అడిగినా వాళ్ల ఇంట్రెస్ట్ ఎంతవరకూ ఉంటుందనేది మీకు తెలిసిందే. 'రుద్రమదేవి ' సినిమా చేస్తున్నప్పుడు అందులో అతిథి పాత్ర చేయడానికి బన్నీ ముందుకు వచ్చాడు. అలా ఎంతమంది ఉన్నారు? అన్నిసార్లూ వెళ్లి బన్నీని అడగలేం కదా" అన్నారు.
'శాకుంతలం' అనే టైటిల్ పెట్టినప్పటికీ, దుష్యంతుడు లేని శకుంతల లేదు. దుష్యంతుడి పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉంటుందనేది అందరికీ తెలిసిందే. మనం ఎంత తగ్గించాలనుకున్నా తగ్గించలేని పాత్ర అది. అలాంటి పాత్రను ఏ హీరో అయినా నేను చేస్తాను అని రావాలి .. నేను ఎనౌన్స్ చేసినా కానీ ఎవరూ రాలేదు. నేనుగా సంప్రదించే వాతావరణం కూడా నాకు కనిపించలేదు. అందువల్లనే ఇక్కడ ఎవరికీ తెలియని దేవ్ మోహన్ ను తీసుకోవడం జరిగింది" అంటూ చెప్పుకొచ్చారు.