19 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న యాక్సెంచర్

  • ఖర్చులు తగ్గించుకునేందుకే కోతలన్న కంపెనీ
  • 18 నెలలపాటు లే ఆఫ్‌లు కొనసాగుతాయని వెల్లడి
  • తొలగింపునకు గురయ్యే ఉద్యోగులకు ప్యాకేజీ కోసం 1.2 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయింపు
ఐటీ ఉద్యోగులకు కష్టకాలం కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్ నుంచి మెటా వరకు ఇటీవల పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగించాయి. ఆర్థిక మాంద్యం, ఖర్చు తగ్గింపులు, భవిష్యత్ ప్రణాళికలు వంటి వాటిని సాకుగా చూపిస్తూ లక్షలాదిమంది ఉద్యోగులను రోడ్డున పడేశాయి. ఇప్పుడీ జాబితాలో మరో ఐటీ కంపెనీ యాక్సెంచర్ చేరింది. ఏకంగా 19 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్టు తెలిపింది. ప్రభావిత ఉద్యోగుల్లో ఎక్కువమంది నాన్ బిల్లబుల్ కార్పొరేట్ విభాగంలోని వారేనని తెలిపింది. 

ఖర్చుల నియంత్రణ నేపథ్యంలోనే ఉద్యోగులను తొలగిస్తున్నామని, వచ్చే 18 నెలలపాటు ఇవి కొనసాగుతాయని యాక్సెంచర్ పేర్కొంది. తొలగింపునకు గురయ్యే ఉద్యోగుల కోసం ప్యాకేజీ అందించేందుకు 1.2 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించింది. కాగా, వృద్ధి రేటు ఈ ఏడాది 8 నుంచి 11 శాతం వరకు ఉంటుందని గతంలో అంచనా వేసిన సంస్థ.. ప్రస్తుత పరిస్థితుల్లో అది 10 శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉందని భావిస్తోంది.


More Telugu News