టీడీపీలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి.. నేడు చంద్రబాబు సమక్షంలో చేరిక
- నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని వ్యాఖ్య
- నగరంలో చంద్రబాబు, లోకేశ్ ఫ్లెక్సీల ఏర్పాటు
- గిరిధర్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలు కూడా..
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి నేడు టీడీపీలో చేరబోతున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. అందరూ తరలివచ్చి తనకు మద్దతు తెలపాలని కోరారు.
టీడీపీలో చేరుతున్న సందర్భంగా చంద్రబాబునాయుడు, లోకేశ్ ఫొటోలున్న ఫ్లెక్సీలను నగరంలో ఏర్పాటు చేశారు. ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన అనంతరం తాడేపల్లికి వెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారు. గిరిధర్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరుతారు. వైసీపీ నేత అయిన గిరిధర్‌రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతూ రెబల్‌గా మారారు. ఆయన కూడా పార్టీని వీడి టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది.