సత్యమే నా దేవుడు.. సూరత్ కోర్టు తీర్పు తర్వాత రాహుల్ ట్వీట్!

  • మోదీపై వ్యాఖ్యల కేసులో రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
  • వెంటనే 30 రోజుల బెయిల్ మంజూరు 
  • మహాత్మాగాంధీ మాటలను ప్రస్తావించిన చేసిన కాంగ్రెస్ నేత 
ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘నా మతం.. సత్యం, అహింసపై ఆధారపడింది. సత్యమే నా దేవుడు.. అహింసే అందుకు సాధనం - మహాత్మా గాంధీ’’ అని ట్వీట్ చేశారు. 

2019లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఇంటి పేరుపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోదీ అనే ఎందుకు ఉంటాయని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేష్‌ మోదీ.. సూరత్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. విచారణ జరిపిన కోర్టు.. తాజాగా రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది.


More Telugu News