విమానంలో తప్పతాగి ఇద్దరు ప్రయాణికుల రచ్చ
- ఇండిగో విమానంలో బుధవారం వెలుగుచూసిన ఘటన
- తోటి ప్రయాణికుల ముందే మద్యం తాగిన నిందితులు
- అభ్యంతరం చెప్పిన వారిపై దుర్భాషలు
- విమానం ముంబైలో దిగగానే నిందితుల అరెస్ట్
విమానంలో మద్యం సేవించి తోటి ప్రయాణికులను దుర్భాషలాడిన ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం దుబాయి నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో విమానంలో దత్తాత్రేయ బాపార్‌దేకర్, జాన్ జార్జ్ డిసౌజా మద్యం సేవించినట్టు తెలిపారు.
గల్ఫ్ నుంచి వస్తున్న వారు అక్కడి డ్యూటీ షాపులో మద్యం కొనుగోలు చేశారు. ఆ తరువాత.. విమానంలోనే మద్యం సేవించడం ప్రారంభించారు. దీనిపై తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో..నిందితులు వారిపై నోరు పారేసుకున్నారు. అంతేకాకుండా.. నిందితుల్లో ఒకరు బాటిల్ చేతిలో పట్టుకుని విమానం ఐల్‌లో నిర్లక్ష్యంగా నడుస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు. దీంతో.. విమానంలోని సిబ్బంది అతడి చేతిలోని మద్యం బాటిల్‌ను బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది.
కాగా.. విమానం ముంబైలో లాండైన అనంతరం పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తోటి ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టేలా వ్యవహరించినందుకు సెక్షన్ 336తో పాటూ ఎయిర్ క్రాప్ట్ రూల్స్‌లోని 21,22, 25 నిబంధనల కింద వారిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటన వెలుగు చూడటంతో దేశంలో ఇప్పటివరకూ ఇది ఏడోసారని తెలుస్తోంది.