నేను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు: హీరో శ్రీకాంత్
- 'పీపుల్స్ ఎన్ కౌంటర్'తో పరిచయమైన శ్రీకాంత్
- చాలా వేగంగా 100 సినిమాలను పూర్తిచేసిన హీరో
- 32 ఏళ్ల కెరియర్లో ఎప్పుడూ ఖాళీగా లేనన్న శ్రీకాంత్
- తన బిహేవియర్ వల్లనే ఇది సాధ్యమైందని వెల్లడి
శ్రీకాంత్ 'పీపుల్స్ ఎన్ కౌంటర్' సినిమాతో 1991లో తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ, చాలా వేగంగా 100 సినిమాలను పూర్తిచేశారు. ఈ రోజున ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"నటుడిగా నా కెరియర్ 32 ఏళ్లను పూర్తిచేసుకోవడం నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ 32 ఏళ్లలో ఎప్పుడూ కూడా నేను అవకాశాల కోసం వెయిట్ చేయలేదు. ఎక్కడ గ్యాప్ లేకుండా వరుస సినిమాలను చేస్తూనే వెళుతున్నాను. సినిమాల్లో ట్రై చేసేటప్పుడు కూడా నాకు ఆకలి కష్టాలు తెలియదు. ఇంటి దగ్గర నుంచి మా ఫాదర్ పంపిస్తూనే ఉండేవారు" అన్నారు.
"సినిమాల్లో ఎంట్రీ దొరుకుతుందా లేదా అనే విషయంలో మా ఫాదర్ ని రెండేళ్ల గడువు అడిగాను. ఆ గడువులోగానే నాకు అవకాశాలు రావడంతో, వెనుదిరిగి చూసుకోలేదు. నేను మంచి నటుడిని కావడం వలన నాకు ఎక్కువ అవకాశాలు వచ్చాయని చెప్పను. ఎప్పుడూ ఏ నిర్మాతనుగానీ .. దర్శకుడిగాని నేను ఇబ్బంది పెట్టలేదు. నా క్రమశిక్షణ .. మంచి బిహేవియర్ వల్లనే అవకాశాలు వచ్చాయని నమ్ముతాను" అని చెప్పుకొచ్చారు.