వైసీపీ-బీజేపీ కలిసి ఉన్నాయనేది అపోహ మాత్రమే: సోము వీర్రాజు

  • తాను ప్రతి రోజు వైసీపీని, జగన్ ను విమర్శిస్తుంటానన్న సోము వీర్రాజు
  • ఇవాళ కూడా విమర్శించానని వివరణ 
  • మరి వైసీపీతో కలిసున్నది ఎక్కడ? అని ప్రశ్నించిన వైనం
  • వైసీపీ సర్కారుపై ప్రజాపోరాటం చేస్తామని వెల్లడి
ఏపీలో వైసీపీ, బీజేపీ కలిసి ఉన్నాయనేది అపోహ మాత్రమేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తాను ప్రతిరోజు వైసీపీని, జగన్ ను విమర్శిస్తుంటానని, మరి వైసీపీతో బీజేపీ ఏ విధంగా కలిసున్నట్టు? అని ప్రశ్నించారు. ఇవాళ కూడా విమర్శించానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజాపోరాటం చేస్తామని సోము వీర్రాజు వెల్లడించారు. 

ఏపీలో బీజేపీ ఎదగకూడదని ప్రయత్నిస్తున్నారని, కేంద్రంలో మోదీ పాలన బాగుందంటారని, ఏపీకి వచ్చేసరికి బీజేపీని అప్రదిష్ట పాల్జేసేందుకు ప్రయత్నిస్తుంటారని వ్యాఖ్యానించారు. 

పవన్ కల్యాణ్ కలిసి రావడంలేదని బీజేపీ నేత మాధవ్ అన్నారు కదా... మీరు ఎలా స్పందిస్తారని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా... దానిపై నేను స్పందించను అంటూ సోము వీర్రాజు సమాధానం దాటవేశారు. మా రెండు పార్టీలు విడిపోవాలనే కదా మీరు కోరుకుంటోంది అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. మీరు జనసేనతో పొత్తులో ఉన్నారు కదా అన్న ప్రశ్నకు కూడా సోము వీర్రాజు నుంచి సమాధానం రాలేదు.


More Telugu News