అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్‌ను ప్రశ్నించిన పోలీసులు.. ఇంతకీ ఆమెవరు?
- ఐదు రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఖలిస్థానీ నేత
- కిరణ్‌దీప్‌ను గంటపాటు ప్రశ్నించిన మహిళా పోలీసు అధికారులు
- కిరణ్ యూకేకు చెందిన ఎన్నారై
- గత నెలలోనే అమృత్‌పాల్‌తో వివాహం
అమృత్‌పాల్ సింగ్.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. అతడి కోసం వందలాదిమంది పంజాబ్ పోలీసులు ఐదు రోజులుగా గాలిస్తున్నారు. వేషాలు మార్చుకుని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఈ ఖలిస్తాన్ నేత ఆచూకీ పోలీసులకు ఇంకా అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో అమృత్‌సర్‌కు చెందిన ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులు అతడి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. వారిలో అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ కూడా ఉంది.
కిరణ్‌దీప్ కౌర్, అమృత్‌పాల్ తండ్రి తార్సెమ్ సింగ్, తల్లిని మహిళా పోలీసు అధికారులు దాదాపు గంటపాటు విచారించారు. అమృత్‌పాల్ కార్యకలాపాలకు విదేశాల నుంచి నిధులు అందుతున్న ఆరోపణలపై కిరణ్‌కౌర్‌ను జల్లుపూర్ ఖేడా గ్రామంలో విచారించారు.
కిరణ్‌దీప్ కౌర్ ఎవరంటే?
కిరణ్‌కౌర్ యూకేకు చెందిన ఎన్నారై. మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అంటే గత నెలలోనే అమృత్‌పాల్ ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత పంజాబ్ చేరుకున్న కిరణ్‌కౌర్ అమృత్‌పాల్ పూర్వీకుల గ్రామమైన జల్లుపూర్ ఖేడాలో నివసిస్తోంది. కిరణ్‌కౌర్ పూర్వీకులు జలంధర్‌లో ఉండేవారని సమాచారం. నటుడు-కార్యకర్త అయిన దీప్ సిద్ధు స్థాపించిన ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్‌గా అమృత్‌పాల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే కిరణ్‌తో అమృత్‌పాల్ వివాహం జరిగింది. గంటపాటు కిరణ్‌ను ప్రశ్నించిన పోలీసులు.. ఆమె ఎలాంటి సమాధానాలు చెప్పిందన్న విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.
35 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
విదేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా అమృత్‌పాల్ రూ. 35 కోట్లు అందుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అమృత్‌పాల్‌తోపాటు అతడి భార్య, తండ్రి, బంధువుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. తాను అందుకున్న సొమ్ముతో ఈ ఖలిస్థానీ నేత ఓ కొత్త ఎస్‌యూవీ కొనుగోలు చేశాడు. అలాగే, విదేశాల్లోని ఖలిస్థానీ సానుభూతిపరుల ద్వారా 35 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అక్రమ ఆయుధాలును కొనుగోలు చేశాడు. అమృత్‌పాల్‌కు పాకిస్థాన్ ఐఎస్ఐతో ఉన్న సంబంధాలపైనా భద్రతా బలగాలు కూపీ లాగుతున్నాయి.