చెన్నై వన్డేలో టీమిండియా టార్గెట్ 270 రన్స్

  • టీమిండియా, ఆసీస్ మధ్య చివరి వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
  • 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్
  • రాణించిన ఆసీస్ లోయరార్డర్
  • హార్దిక్ పాండ్యాకు 3, కుల్దీప్ కు 3 వికెట్లు
టీమిండియాతో చివరి వన్డేలో తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందని భావించిన ఆస్ట్రేలియా జట్టు.. లోయరార్డర్ సాయంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ అత్యధికంగా 47 పరుగులు చేయగా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 33 పరుగులు చేశాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ సున్నాకే వెనుదిరిగాడు. 

వార్నర్ 23, లబుషేన్ 28, అలెక్స్ కేరీ 38, స్టొయినిస్ 25, షాన్ అబ్బాట్ 26, ఆస్టన్ అగర్ 17, స్టార్క్ 10, జంపా 10 (నాటౌట్) విలువైన పరుగులు జోడించి ఆసీస్ ను ఆదుకున్నారు. వీళ్లలో ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడనప్పటికీ, సమష్టిగా ఆడి ఆసీస్ పోరాడదగ్గ స్కోరు అందించారు. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, కుల్దీప్ యాదవ్ 3, మహ్మద్ సిరాజ్ 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు సాధించారు.


More Telugu News