తమిళనాడులో బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు... 8 మంది మృతి

  • కాంచీపురంలో విషాద ఘటన
  • ఒక్కసారిగా పేలిపోయిన బాణసంచా కర్మాగారం
  • మంటల్లో కాలిపోయిన కార్మికులు
  • 19 మందికి తీవ్ర గాయాలు
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. కాంచీపురంలో ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో 11 మందిని కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మరో 8 మందికి ఇతర ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలి వద్దకు చేరుకున్నారు. పేలుడు జరిగిన బాణసంచా పరిశ్రమ వద్దకు చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. 

ఉష్ణోగ్రతలో చోటుచేసుకున్న మార్పు కారణంగా బాణసంచా పరిశ్రమలోని రసాయనాలు విస్ఫోనం చెంది ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, ఈ పేలుడు ధాటికి సమీపంలోని పలు మూగజీవాలు కూడా మృత్యువాత పడినట్టు తెలుస్తోంది.


More Telugu News