టీమిండియాతో చివరి వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్
- భారత్, ఆసీస్ మధ్య 3 వన్డేల సిరీస్
- చెన్నై వేదికగా నేడు చివరి వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు చివరి వన్డే జరుగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ మరోసారి ధాటిగా ఆడుతూ తమ జట్టుకు శుభారంభం అందించారు. 10.5 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 1 వికెట్ నష్టానికి 68 పరుగులు.
33 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం ఓపెనర్ మిచెల్ మార్ష్ 34, కెప్టెన్ స్టీవ్ స్మిత్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో సీనియర్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా ఆడుతుండడంతో ఆసీస్ జట్టులో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవు. కాగా, ఈ సిరీస్ లో భారత్, ఆసీస్ చెరో మ్యాచ్ గెలవడం తెలిసిందే. నేటి మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సిరీస్ వశమవుతుంది.