భార్యను దోమలు కుడుతున్నాయంటూ ఫిర్యాదు.. మస్కిటో కాయిల్ తెచ్చి ఇచ్చిన పొలీసులు
- ఆసుపత్రిలో ప్రసవించిన యూపీ మహిళ
- నొప్పులకు తోడు.. దోమల బెడదతో సతమతం
- భార్య పరిస్థితి చూసి కలత చెందిన భర్త
- మస్కిటో కాయిల్ తేవాలంటూ సోషల్ మీడియాలో పోలీసులకు విజ్ఞప్తి
- తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించిన పోలీసులు
అతడి భార్య ప్రసవించి ఓ రోజు కూడా గడవలేదు. ఓవైపు నొప్పి..మరోవైపు దోమల బెడద..వెరసి ఆమె తీవ్ర ఇబ్బందికి గురైంది. భార్య వేదన చూడలేక ఆమె భర్త కలత చెందాడు. అది అర్ధరాత్రి..సమయం సుమారు గం. 2.45. దీంతో.. అతడికి ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదుపై తక్షణం స్పందించిన పోలీసులు ఆ జంట సమస్యకు పరిష్కారం కూడా చూపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.
చాంద్‌దౌసీ ప్రాంతానికి చెందిన అసద్ ఖాన్ అనే వ్యక్తి భార్య ఇటీవలే ఆసుపత్రిలో ప్రసవించింది. అయితే.. అక్కడ దోమల బెడద ఎక్కువగా ఉండటంతో ఆమె తీవ్ర ఇబ్బందికి గురైంది. భార్య పరిస్థితి చూసి కలత చెందిన అసద్ పోలీసులకు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశాడు. ‘‘నా భార్య తీవ్ర ఇబ్బందికి గురవుతోంది. ఓవైపు నొప్పులు మరోవైపు దోమల బెడద.. ఆమె బాధను చూడలేకుండా ఉన్నాను. దయచేసి మార్టీన్ మస్కిటో కాయిల్‌ను ఇప్పించండి’’ అంటూ ట్వీట్ చేశాడు.
ఇది చూసిన పోలీసులు ఏమనుకున్నారో గానీ నిమిషాల వ్యవధిలో మస్కిటో కాయిల్‌తో ఆసుపత్రికి వచ్చేశారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడటంతోనే వారు ఆసుపత్రికి మస్కిటో కాయిల్స్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇక నిమిషాల వ్యవధిలో తన సమస్యను పరిష్కరించిన పోలీసులకు అసద్ ధన్యవాదాలు తెలిపారు.