వైద్య ఖర్చులు భరించలేక యువకుడి ఆత్మహత్య..
- దీర్ఘకాలిక వ్యాధితో ఢిల్లీ యువకుడు సతమతం
- తడిసిమోపడవుతున్న వైద్య ఖర్చులు
- తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆత్మహత్యకు నిర్ణయం
- నొప్పి తెలియకుండా ఆత్మహత్య చేసుకునే మార్గాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చింగ్
- చివరకు ఆక్సిజన్ పాయిజనింగ్ ద్వారా బలవన్మరణం
ఓవైపు అనారోగ్యం.. మరోవైపు పెరిగిపోతున్న ఆసుపత్రి ఖర్చులు.. వెరసి ఓ ఢిల్లీ యువకుడి ఉసురు తీశాయి. వైద్య ఖర్చులు భారంగా మారడంతో అతడు హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం..స్థానిక ఆదర్శ్ నగర్‌లోని ఓ హోటల్‌లో నితీశ్(24) బలవన్మరణానికి పాల్పడ్డాడు. భారీ స్థాయిలో ఆక్సిజన్ పీల్చి అతడు ప్రాణాలను తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్‌లోని ప్రాణవాయువు పైపు ద్వారా పీల్చి ప్రాణాలు వదిలాడు. మోతాదుకు మించి ప్రాణావాయువును పీలిస్తే గుండె కొట్టుకునే వేగం ప్రమాదకర స్థాయికి పడిపోతోందని వైద్యులు చెబుతారు. ఇది చివరకు మరణానికి దారి తీస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ఆక్సిజన్ పాయిజనింగ్ అంటారు.
కాగా.. నితీశ్ రాసిన ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. దీర్ఘకాలిక అనారోగ్యం.. తడిసిమోపెడవుతున్న ఆసుపత్రి ఖర్చులు తనను మానసికంగా కుంగదీసినట్టు యువకుడు తన లేఖలో పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు వెల్లడించాడు. అయితే.. నొప్పి లేకుండా ఆత్మహత్య ఎలా చేసుకోవాలో తెలుసుకునేందుకు అతడు ఆన్‌లైన్‌లో వెతికినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ పాయిజనింగ్ గురించి అతడికి తెలిసిందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో పలువీడియోలు కూడా చూసినట్టు పేర్కొన్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.