మన దేశంలో ఆనందం తక్కువా..? టాప్ -10 హ్యాపీయెస్ట్ దేశాలు ఇవే..
- ప్రపంచ సంతోషకర సూచీ 2023లో భారత్ కు 126వ స్థానం
- గతేడాదితో పోలిస్తే 10 స్థానాలు మెరుగు
- సంతోషం వెల్లివిరుస్తున్న దేశాలుగా ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్ ల్యాండ్
మన దేశ ప్రజల్లో సంతోషం తక్కువా..? అంటే ఇతమిద్ధంగా ఇదీ అని ఎవరూ చెప్పలేరు. ఎవరికి వారు తాము సంతోషంగా ఉన్నదీ, లేనిదీ అయితే చెప్పగలరు. వరల్డ్ హ్యాపీయెస్ట్ రిపోర్ట్ ను చూసి భారత్ సంతోషంగా ఉందా? అన్నది తెలుసుకోవచ్చు. దీన్ని యూఎన్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ విడుదల చేసింది. 2020-2022 మధ్య ప్రజల సగటు జీవితాల ఆధారంగా 150కి పైగా దేశాలకు ర్యాంకులు కేటాయించింది. సామాజికంగా లభించే మద్దతు, ఆదాయం, ఆరోగ్యం, స్వేచ్ఛ, ఉదారత, అవినీతి లేకపోవడం ఈ అంశాలను ప్రామాణికంగా పెట్టుకుని, ఆయా దేశాల్లోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ర్యాంకులు ఇచ్చింది.
భారత్ టాప్ -10లో కాదు కదా, టాప్-100లోనూ లేదు. 126వ స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది 136వ స్థానంతో పోలిస్తే 10 స్థానాలు మెరుగుపడిందని సంతోషపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచంలో ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్న దేశంగా ఫిన్లాండ్ వరుసగా ఆరో ఏడాది మొదటి స్థానంలో నిలిచింది. టాప్-10లో ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్, ఐస్ ల్యాండ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, లగ్జెంబర్గ్, న్యూజిలాండ్ ఉన్నాయి.
దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్విట్టర్ లో స్పందించారు. అంతర్జాతీయ సంతోషకర సూచీ 2023లో మన దేశం దయనీయంగా ఉండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. దేశ స్థితిని తెలిపే ముఖ్యమైన పారామీటర్ గా తాను ఈ సూచీని నమ్ముతున్నట్టు చెప్పారు.