ఎన్టీఆర్ శతజయంతి.. కేంద్రం కీలక ప్రకటన
- ఎన్టీఆర్ శతజయంతి పురస్కరించుకుని రూ.100 నాణెం విడుదల చేస్తున్నట్టు కేంద్రం ప్రకటన
- వెండి, రాగి లోహ మిశ్రమంతో నాణెం తయారీ
- నాణేనికి ఓవైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం
- రెండో వైపున ఎన్టీఆర్ చిత్రం
దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని వంద రూపాయల నాణేన్ని విడుదల చేస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అధికారిక గెజిట్ జారీ చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. 50:50 నిష్పత్తిలోని వెండి-రాగి లోహ మిశ్రమంతో ఈ నాణేన్ని తయారు చేస్తారు.
దీని చుట్టుకొలత 44 మిల్లీమీటర్లు. నాణేనికి ఒకవైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం, రెండోవైపున ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి అని రాసుంటుంది. 1923-2023 తారీఖును కూడా ముద్రిస్తారు. ఇక కేంద్రం విడుదల చేసిన గెజిట్‌తో నందమూరి అభిమానుల్లో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది.