ప్రకాశ్ రాజ్ ను చెంపదెబ్బకొట్టి, ఆ డైలాగ్ చెప్పేస్థాయి బ్రహ్మానందంగారికే ఉంది: కృష్ణవంశీ

  • కొంతసేపటి క్రితం జరిగిన 'రంగ మార్తాండ' ప్రెస్ మీట్ 
  •  ఈ సినిమా చేయడానికి కారకుడు ప్రకాశ్ రాజ్ అని చెప్పిన కృష్ణవంశీ 
  • షూటింగు సమయంలో బ్రహ్మానందం భోజనం చేయలేదని వెల్లడి
  • ఆ డైలాగ్ చెప్పగలిగే స్థాయి బ్రహ్మానందానికే ఉందని వ్యాఖ్య

భావోద్వేగాలకు సంబంధించిన కథలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో కృష్ణవంశీ సిద్ధహస్తుడు. ఆయన దర్శకత్వం వహించిన 'రంగమార్తాండ' రేపు థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. కొంతసేపటి క్రితం జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో కృష్ణవంశీ మాట్లాడారు. 

" నేను ఈ సినిమా తీయడానికి ముఖ్య కారకుడు. ప్రకాశ్ రాజ్. తను ఈ సినిమా చూసి, నేను రీమేక్ చేస్తే బాగుంటుందని నాకు అప్పగించాడు. కథాపరంగా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ను చెంపదెబ్బ కొట్టి .. తిట్టగలిగే ఆర్టిస్ట్ ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తే, అందుకు బ్రహ్మానందమే కరెక్ట్ అనిపించి ఆయనను తీసుకోవాలని అనుకోవడం జరిగింది" అని అన్నారు. 

"బ్రహ్మానందం గారు ఒప్పుకుంటారా అనే ఆలోచనతో నేను .. ప్రకాశ్ రాజ్ ఆయన ఇంటికి వెళ్లి .. విషయం చెప్పాము. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. 1250 సినిమాలు చేసిన బ్రహ్మానందం గారు  .. నేను ఏం చెబితే అది ఒక కొత్త ఆర్టిస్ట్ లా చేశారు. సీన్ కి తగినట్టుగా ..  పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం భోజనం మానేసి .. మంచినీళ్లు మాత్రమే తీసుకుంటూ చేశారు" అంటూ చెప్పుకొచ్చారు.



More Telugu News