పేపర్ లీకేజీలో కేటీఆర్ దోషి అనడం సరికాదు: ఇంద్రకరణ్ రెడ్డి
- పేపర్ లీకేజీలు సాధారణంగా జరిగేవే అన్న ఇంద్రకరణ్ రెడ్డి
- ఇంటర్, పదో తరగతి పేపర్లు లీకైన సందర్భాలు చాలా ఉన్నాయని వ్యాఖ్య
- కేటీఆర్ పై రేవంత్ చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలన్న మంత్రి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్వవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ హస్తం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందిస్తూ... పేపర్ లీకేజీలు సాధారణంగా జరిగేవే అని వ్యాఖ్యానించారు. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయని అన్నారు.
గతంలో కూడా ఇంటర్, పదో తరగతి పేపర్లు లీకయిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ ను దోషి అనడం సరికాదని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. బండి సంజయ్ నోటికి కంట్రోల్ లేకుండా పోయిందని... నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని అన్నారు.