వాడిపోయిన ఆకుకూరలను రసాయనంలో ముంచి.. వైరల్ వీడియో!

  • ఆకుకూరలను ఫ్రెష్ గా ఉంచేందుకు రసాయనాల్లో ముంచుతున్న వైనం
  • కెమికల్ ఎఫెక్ట్ తో వెంటనే ఫ్రెష్ గా మారిపోతున్న ఆకులు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
తెల్లగా ఉన్నవన్నీ పాలు కావు.. అలానే తాజాగా కనిపించే కూరగాయలు, ఆకుకూరలన్నీ నిజంగా తాజావి కావు. మామిడిపండ్లను మాగబెట్టేందుకు, పండ్లు పాడైపోకుండా ఉండేందుకు కెమికల్స్ వాడుతున్నారు. పండ్లు నిగనిగలాడేలా కనిపించేందుకు రసాయనాలు పూస్తున్నారు. ఇది కూడా అలాంటి ఘటనే. 

ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఆకుకూరలను ఫ్రెష్ గా ఉంచేందుకు కెమికల్ లో ముంచుతున్నారు. వాడిపోయిన ఆకులను రసాయనంలో ముంచిన కొద్దిసేపటికి కెమికల్ ఎఫెక్ట్ తో అవి విచ్చుకుంటున్నాయి. అప్పుడే తీసుకొచ్చినట్లుగా తాజాగా మారిపోతున్నాయి.

ఈ వీడియోను అమిత్ తధాని అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ‘రెండు నిమిషాల నిజ జీవిత భయానక కథ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన జనం కూడా నిజంగా భయానకమని కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో ఆ కెమికల్స్ తో ప్రమాదమేమీ లేదని చెబుతున్నారు. మరికొందరేమో.. రసాయనాలతో ఆరోగ్యానికి ముప్పు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ వీడియో చూశాక.. రేపు బయటికెళ్లి ఆకుకూరలు ఎలా కొనాలి?’ అంటూ ఓ యూజర్ ప్రశ్నించాడు. ఈ వీడియో మీరూ చూడండి మరి!!


More Telugu News