తెలంగాణ యువతపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
- ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి యువతకు అనేక సవాళ్లు ఉన్నాయన్న గవర్నర్
- ఎలాంటి సవాళ్లనైనా తట్టుకుని ధైర్యంగా ఎదుర్కోగలరని వ్యాఖ్య
- యువతకు రాజ్ భవన్ అండగా ఉంటుందని హామీ
రాజ్‌భవన్ ద్వారా చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. రాజ్‌భవన్‌లో సోమవారం రాత్రి గవర్నర్ ప్రీ ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర యువతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణ యువత ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు. అన్ని సవాళ్లలోనూ రాజ్‌భవన్ వారికి అండగా ఉంటుందని గవర్నర్ హామీ ఇచ్చారు.
సీపీఆర్ ఛాలెంజ్, రక్తదాన శిబిరాలు, పూర్వ విద్యార్థులను కలిపే ఛాన్సలర్ వంటి కార్యక్రమాలను రాజ్‌భవన్ చేపట్టిందని వివరించారు. ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సహాయం చేయడానికి ముందుకొచ్చే పూర్వ విద్యార్థులను రాజ్ భవన్ సంప్రదిస్తోందన్నారు. వివిధ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా 12 మందిని గవర్నర్ సత్కరించారు.