త్రివిక్రమ్ తర్వాత అంతటి ఎనర్జీ విష్వక్సేన్ లో చూశా: నివేదా పేతురాజ్
- విష్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో 'దాస్ కా ధమ్కీ'లో నటించిన నివేదా
- రేపు విడుదల అవుతున్న చిత్రం
- బాలయ్య లాంటి హీరోలను డైకెర్ట్ చేసే సత్తా విష్వక్ లో ఉందన్న నివేదా
'ఫలక్ నుమా దాస్' చిత్రంతో కెరీర్ ఆరంభంలోనే తనలోని దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నాడు విష్వక్సేన్. అతను మరోసారి మెగా ఫోన్ పట్టి 'దాస్ కా ధమ్కీ' చిత్రాన్ని రూపొందించాడు. ఉగాది కానుకగా బుధవారం ఈ చిత్రం విడుదలవనుంది. ‘పాగల్’ మూవీ తర్వాత విష్వక్సేన్, నివేదా పేతురాజ్ మరోసారి ఇందులో జంటగా నటించారు. చిత్రం విడుదల సందర్భంగా హీరో, హీరోయిన్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ఈ చిత్రంలో తనది చాలా గ్లామరస్ పాత్ర అని నివేదా తెలిపింది. కెరీర్ లో తొలిసారి ఇలాంటి పాత్ర చేశానని చెప్పింది. గతంలో ఎప్పుడూ లేనంతగా డ్యాన్స్ కూడా చేశానని తెలిపింది. విష్వక్సేన్ తో ‘పాగల్’ చిత్రం చేస్తున్నప్పుడే అతని ‘ఓరి దేవుడా’లో ఆఫర్ వచ్చిందని వెల్లడించింది. కానీ ఆ పాత్ర తనకు సెట్ కాదని ఒప్పుకోలేదని చెప్పింది. తర్వాత ఈ స్క్రిప్ట్ వినడంతో వెంటనే ఓకే చెప్పానని తెలిపింది.
‘ఇది యూనిక్ స్టోరీ. విష్వక్సేన్ దర్శకత్వం వహించడం మరింత ప్రత్యేకం. ఆయన కెరీర్‌లో ఇది మైలురాయిగా నిలుస్తుంది. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా మూడు బాధ్యతలకు తను పూర్తి న్యాయం చేశారు. నేను పని చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ తర్వాత అంతటి ఎనర్జీ విష్వక్సేన్ లో చూశాను‘ అని చెప్పుకొచ్చింది. కన్నడ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ లాంటి మాస్ టచ్ విష్వక్సేన్ లో ఉందని, బాలకృష్ణ గారి లాంటి పెద్ద మాస్ హీరోలని కూడా డైరెక్ట్ చేసే సత్తా ఉందని విష్వక్సేన్ పై ప్రశంసల వర్షం కురిపించింది.