‘కథ వెనుక కథ’ పెద్ద హిట్ అవుతుంది: నిర్మాత అవనీంద్ర కుమార్
- విశ్వంత్ హీరోగా చేసిన 'కథ వెనుక కథ'
- సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- సంగీతాన్ని సమకూర్చిన శ్రావణ్ భరద్వాజ్
- ఈ నెల 24వ తేదీన విడుదలవుతున్న సినిమా
కొత్త కాన్సెప్ట్ చిత్రాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ప్రారంభమైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యానర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ .. శ్రీజిత గౌష్ .. శుభశ్రీ ప్రధాన తారాగణంగా నటించారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అవనీంద్ర కుమార్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు.
నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. హీరో విశ్వంత్ మాట్లాడుతూ .. ‘‘నటుడిగా 'కథ వెనుక కథ' నా కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుంది. నేను ఎక్కువగా మలయాళ సినిమాలు చూస్తూ పెరిగాను. దీంతో నాపై వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నా కెరీర్‌లో ఇదొక ఎక్స్‌పెరిమెంట్ మూవీ. ఇది హీరో డ్రైవింగ్ మూవీ కాదు .. కంటెంట్ డ్రైవింగ్ మూవీ" అన్నాడు.
నిర్మాత అవనీంద్ర కుమార్ మాట్లాడుతూ ‘‘మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి వచ్చి.. కృష్ణ చైతన్య గురించి చెప్పి కథ వినమన్నారు. వినగానే.. వెంటనే నాకు సునీలే గుర్తుకు వచ్చారు. ఎందుకంటే మంచి కథ దొరికితే సినిమా చేస్తానని అంతకుముందు ఓ సారి ఆయనకు చెప్పాను. ‘కథ వెనుక కథ’ వినగానే సునీల్‌కు ఫోన్ చేస్తే ఆయన రెడీ అన్నారు. అక్కడ నుంచి సాయి ముందుండి సినిమాను నడిపించాడు. భవిష్యత్తులోనూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తాం’’ అన్నారు.
చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ‘'కథ వెనుక కథ’ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన మా నిర్మాత అవనీంద్ర కుమార్‌గారికి స్పెషల్ థాంక్స్. హీరో విశ్వంత్‌కి థాంక్స్. ఈ సినిమా అవకాశం రావటానికి ప్రధాన కారణం నా స్నేహితుడు సాయి. ఇది చాలా బలమైన కథ. సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్‌కి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన మా డైరెక్షన్ టీమ్‌కి కృతజ్ఞతలు’’ అన్నారు.