పవన్ నాకు దేవుడే .. కానీ .. !: బండ్ల గణేశ్
- పవన్ పట్ల ప్రేమ - గౌరవం ఉన్నాయన్న బండ్ల
- ఆయన ముందున్న లక్ష్యం వేరని వెల్లడి
- తాను తప్పించుకోవటం లేదని వ్యాఖ్య
- ఆయనకి అడ్డుగా ఉండటం ఇష్టం లేదని వివరణ
నిర్మాతగా తనకి లైఫ్ ఇచ్చింది పవన్ కల్యాణ్ అనీ .. తనకి ఆయన దేవుడని బండ్ల గణేష్ చాలా వేదికలపై చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "పవన్ నన్ను పక్కన పెట్టాడని అంటున్నారు .. కానీ `అందులో ఎంతమాత్రం నిజం లేదు. నేనే ఆయన మార్గానికి అడ్డుగా ఉండకూడదని భావించి పక్కకి వచ్చేశాను అంతే" అని అన్నారు.
"సినిమాలకి సంబంధించి పవన్ వెనుక ఉంటాను .. రాజకీయాలకు సంబంధించి మాత్రం పవన్ వెనుక వెళ్లాలని అనుకోవడం తప్పు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ ముందున్న లక్ష్యం వేరు. అందువలన పక్కకి వచ్చేశాను. వేరే కారణాలు చెప్పేసి తప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. పవన్ నాకు దేవుడే .. దేవుడు పూజ మందిరంలో పవిత్రంగా ఉన్నట్టే ఆయన కూడా ఉంటాడు" అని చెప్పారు.
"పవన్ కల్యాణ్ గారిని నేను దేవుడిలా భావిస్తాను. కానీ మా అమ్మా నాన్నల కంటే మీరే ఎక్కువ .. నా భార్య బిడ్దల కంటే మీరే ఎక్కువ అని అనలేను. ఎందుకంటే అంతరాత్మకి వ్యతిరేకంగా నేను వెళ్లను. ఒక వ్యక్తిని తల్లిదండ్రులకంటే .. భార్య బిడ్డలకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఎవరు చెప్పినా అది అబద్ధమే అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు.