బతికే ఉన్న నన్ను చంపేయకండి: కోట శ్రీనివాసరావు
- కోట శ్రీనివాసరావు చనిపోయారంటూ తప్పుడు వార్తలు
- తాను ఆరోగ్యంగానే ఉన్నానన్న కోట
- ఈ తప్పుడు వార్తతో తన కుటుంబ సభ్యులు ఒత్తిడికి గురయ్యారని ఆవేదన
తెలుగు సినీపరిశ్రమలో నవరసాలను పండించిన దిగ్గజ నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. ఆయన చేయని క్యారెక్టర్ లేదు. ప్రతి తెలుగు సినీ ప్రేక్షకుడి అభిమానాన్ని పొందిన కోట శ్రీనివాసరావు గురించి సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారనేదే ఆ వార్త. ఇది ఎంత వరకు నిజం అనేది నిర్ధారణ చేసుకోకుండానే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనిపై కోట శ్రీనివాసరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తాను చనిపోయాననే వార్తను చూసి చాలా మంది ఆందోళనతో ఫోన్లు చేశారని ఆయన చెప్పారు. ఈ వార్త నిజమేనా అని నిర్ధారించుకోవడానికి ఈ ఉదయం పోలీసులు కూడా తన ఇంటికి వచ్చారని తెలిపారు. తాను ఇంకా చనిపోలేదని... ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. బతికున్న తనను చంపేయకండి అని అన్నారు. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాను చనిపోయాననే తప్పుడు ప్రచారంతో తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంతో ఒత్తిడికి గురయ్యారని చెప్పారు. తాను ఉగాది పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్నానని తెలిపారు. కోట శ్రీనివాసరావుపై ఇలాంటి తప్పుడు వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఆయన చనిపోయారంటూ తప్పుడు ప్రచారం చేశారు.